ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు.
విరాట్ కోహ్లీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దాంతో రన్ మిషన్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకునేందుకు విరాట్ కోహ్లీ.. అగ్రస్థానానికి చేరుకునేందుకు కేవలం ఎనిమిది రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల్లో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నది. సిరీస్‌లోని చివరి వన్డేలో కోహ్లీ అజేయంగా 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండుస్థానాలు మెరుగుపరుచుకొని రెండో ప్లేస్‌కు చేరుకున్నాడు. బౌలింగ్ ర్యాంకుల్లో కుల్దీప్ యాదవ్ మూడు ర్యాంకులు మెరుగుపరుచుకొని మూడోస్థానంలో నిలిచాడు. టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ మాత్రమే ఎనిమిది స్థానంలో నిలువగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 11వ స్థానం, రిషబ్ పంత్ 13వ స్థానాలకు చేరుకున్నారు. టెస్ట్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ ప్లేస్‌ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకొని వరుసగా 12వ, 13వ, 14వ స్థానాల్లో నిలిచారు.