ఈ నెల 12న అఖండ 2 సినిమా కోసం.. టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సినిమా ప్రత్యేక షో కోసం రూ.600 టికెట్ ధరలను పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అఖండ 2
తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, డిసెంబర్ 10 (ఈవార్తలు): ఈ నెల 12న అఖండ 2 సినిమా కోసం.. టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సినిమా ప్రత్యేక షో కోసం రూ.600 టికెట్ ధరలను పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షో బుకింగ్స్ గురువారం ఓపెన్ కానున్నట్టు తెలుస్తోంది. ఇక, సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ రూ.50 పెంపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది. మూడు రోజుల పాటు పెంచిన ధరలు కొనసాగింపు ఉంటుందని తెలిపింది. అయితే.. పెరిగిన ఆదాయంలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది. ఈ సొమ్మును టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాకు తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.