భారత్‌లో ప్రతి 4×4 మీటర్ల గ్రీడ్‌కి ఒక ప్రత్యేక పది అంకెల అడ్రస్ కోడ్.
ఇది ఇండియా పోస్ట్, ఐఐటీ హైదరాబాద్, ISRO (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) కలిసి అభివృద్ధి చేశాయి.
డిజిపిన్ ఎందుకు అవసరం?
పాత అడ్రస్‌లు పెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి. డిజిపిన్ ఖచ్చితమైన లొకేషన్‌ను చూపిస్తుంది.
నగరాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఉపయోగపడుతుంది.
డెలివరీ సులభం:
తప్పు వీధి లేదా గల్లీకి డెలివరీ సమస్య ఉండదు.
ఆన్‌లైన్ ఆర్డర్లకు 100% ఖచ్చితమైన అడ్రస్.
అత్యవసర సేవలు త్వరగా వస్తాయి!
అంబులెన్స్, ఫైర్ సర్వీస్, పోలీస్‌లు నేరుగా మీ ఇంటి వద్దకు చేరుతాయి.
ప్రతి డిజిపిన్ కోడ్ ఖచ్చితమైన స్థలాన్ని సూచిస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే.. మీ ఫోన్ జిపియస్ ద్వారా లేదా యాప్‌పై పిన్ డ్రాప్ చేస్తే, అది ప్రత్యేకమైన పది అంకెల కోడ్‌గా మారుతుంది.
మీ డిజిపిన్ ఎలా పొందాలి?
ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో "నో యువర్ డిజిపిన్" క్లిక్ చేయండి.
జిపియస్ అనుమతించండి లేదా మ్యాప్‌లో పిన్ డ్రాప్ చేస్తూ కోడ్ పొందండి. లాగిన్ అవసరం లేదు.
మీకు లభించే ప్రయోజనాలు:
స్టేబుల్ కోడ్:రోడ్లు, భవనాలు మారినా కోడ్ మారదు.
ఓపెన్ సోర్స్ & ఆఫ్లైన్: ఇంటర్నెట్ లేకపోయినా పని చేస్తుంది.