శ్రావణమాసం విశిష్టత


శ్రావణమాసం అంటే శుభమాసం. శ్రావణమాసాన్ని ‘నభో మాసం’ అని కూడా అంటారు. ‘నభో’ అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.

శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఆయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలను సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకు ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తం వివరిస్తుంది.

శ్రావణమాసం అంటే శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రేకాదశి, దామోదర ద్వాదశి,వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. ఈ పండుగలతో పాటు, శ్రావణమాసంలో సోమవారాలు, శుక్రవారాలు, మంగళవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి.

అష్టలక్ష్ములతో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీపూజలకంటే వరలక్ష్మీపూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

evarthalu Web Stories