ఎడారి దేశంలో వరదలు

సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ఇప్పుడు భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. సౌదీలోని మదీనా, జెడ్డా, మక్కా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

saudi arabia floods

సౌదీ అరేబియాలో వరదలు

సౌదీ అరేబియాను ముంచెత్తిన ఫ్లడ్స్

రియాద్: సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ఇప్పుడు భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. సౌదీలోని మదీనా, జెడ్డా, మక్కా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం స్తంభించింది. జెడ్డాలో కురిసిన కుంభవృష్టికి నగరం మొత్తం అతలాకుతలమైంది. కుండపోత వర్షాల తర్వాత నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతో అధికారులు నగరంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు సౌదీ మీడియా నివేదించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టేవరకూ అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు. కాగా, రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలాలు. ప్రతి సంవత్సరం హజ్‌, ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఆయా నగరాలకు చేరుకుంటారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ప్రజల మనసు నాకు తెలుసు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్