సాధారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటం చూస్తుంటాం. కానీ, ఈ మధ్యకాలంలో వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
సిల్వర్
ఒకే రోజు రూ.8,000 పెరుగుదల
బంగారాన్ని మించి వెండి పైపైకి
సాధారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటం చూస్తుంటాం. కానీ, ఈ మధ్యకాలంలో వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా, బుధవారం వెండి ధరలు ఏకంగా రూ.8,000 (హైదరాబాద్) పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2,07,000కు చేరింది. ప్రపంచ సంకేతాల మధ్య దేశీయంగా బలమైన డిమాండ్ ఉండటంతో ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. యూఎస్ డాలర్ బలహీనపడడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న బలమైన అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా, వెండి ధరలు మాత్రం ఒకేసారి గుండె ధడేల్‌మనేలా పెరిగింది. ధరల పెరుగుదలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్లే ఈ పెరుగుదల అని తెలిపారు. అటు..24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,30,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,450కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,30,460కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,19,600కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,310కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,19,450కి చేరింది.
పెరుగుదలకు కారణాలు:
స్థిరంగా తక్కువ సరఫరా
తగ్గుతున్న ఇన్వెంటరీ (నిల్వలు)
ఇటీవల యుఎస్ క్రిటికల్ మినరల్స్ జాబితాలో వెండిని చేర్చడం
గత పది రోజుల్లో వెండి ధరలు ఇలా.. (హైదరాబాద్)
తేదివెండి ధర (కిలో)
డిసెంబర్ 10రూ.2,07,000
డిసెంబర్ 9రూ.1,99,000
డిసెంబర్ 8రూ.1,98,000
డిసెంబర్ 7రూ.1,95,900
డిసెంబర్ 6రూ.1,95,900
డిసెంబర్ 5రూ.1,96,000
డిసెంబర్ 4రూ.2,00,000
డిసెంబర్ 3రూ.2,01,000
డిసెంబర్ 2రూ.1,96,000
డిసెంబర్ 1రూ.1,96,000