పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్మృతి మంధాన
పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరా బేడితో జరిగిన టాక్ షోలో స్మృతి పాల్గొన్నది. ఈ సందర్భంగా మంధాన మాట్లాడుతూ క్రికెట్ ఆడం తప్ప తనకు ఇంకేది ఇష్టం లేదని వెల్లడించింది. భారత జట్టు జెర్సీని వేసుకోవడం వల్ల అది తన బాధలన్నీ తొలగిపోతాయని.. ఎందుకంటే అది తన బాధ్యతను ఇస్తుందని చెప్పుకొచ్చింది. ‘భారత జెర్సీ ధరించడం నాకు స్ఫూర్తినిస్తుంది. నా చింతలన్నింటినీ తొలగిస్తుంది. జెర్సీ ధరించిన తర్వాత మీపై బాధ్యతలు ఉన్నందున మీకున్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టాలని నేను ఎప్పుడూ అందరికీ చెబుతాను. మీరు లక్షలాది మందికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మీరు మంచి ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెడితే సరిపోతుంది’ అని తెలిపింది.