హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి

పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్(సీఏపీ) అండర్ 19 హెడ్ కోచ్ ఎస్ వెంకటరామన్‌పై ముగ్గురు సీనియర్ క్రికెటర్లు దాడి చేశారు. జట్టు ఎంపికలో తమకు అన్యాయం చేశారనే భావనతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

venkataraman

వెంకటరామన్‌

పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్(సీఏపీ) అండర్ 19 హెడ్ కోచ్ ఎస్ వెంకటరామన్‌పై ముగ్గురు సీనియర్ క్రికెటర్లు దాడి చేశారు. జట్టు ఎంపికలో తమకు అన్యాయం చేశారనే భావనతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో కోచ్ వెంకటరామన్‌ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీసులు తెలిపారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి స్థానిక ఆటగాళ్లను ఎంపిక చేయలేదనే కోపంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాకు తెలిపారు.


ఎడారి దేశంలో వరదలు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్