కొన్నాళ్లుగా తమన్నా ఐటెం సాంగ్స్‌తోనే అలరిస్తోంది. అయితే, ఇప్పుడు తన రూట్ మార్చి ఓ బాలీవుడ్ బయోపిక్ లో కీలక పాత్ర పోషించబోతోంది.
తమన్నా
కొన్నాళ్లుగా తమన్నా ఐటెం సాంగ్స్‌తోనే అలరిస్తోంది. అయితే, ఇప్పుడు తన రూట్ మార్చి ఓ బాలీవుడ్ బయోపిక్ లో కీలక పాత్ర పోషించబోతోంది. లెజండరీ డైరెక్టర్ వీ శాంతారామ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతుండగా అందులో శాంతారామ్ రెండో భార్య, ఒకప్పటి నటి జయశ్రీ గడ్కర్ పాత్రలో తమన్నా కనిపించబోతోంది. రీసెంట్‌గా మేకర్స్ ఆ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, అందులో తమన్నా వింటేజ్ సెటప్‌లో చీర కట్టులో ఎంతో అందంగా మెరిశారు.