శర్వానందర్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమారిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నారీ నారీ నడుమ మురారి
శర్వానందర్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమారిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా తేదీ మాత్రమే చెబుతారు, కానీ ఇక్కడ వెరైటీగా సినిమా మొదలయ్యే టైమ్ ను కూడా పోస్టర్ లో వేయడం విశేషం. జనవరి 14న సాయంత్రం సరిగ్గా 5 గంటల 49 నిమిషాలకు సినిమా థియేటర్లలో పడబోతోంది. రిలీజ్ చేసిన పోస్టర్ చాలా కలర్ ఫుల్‌గా, పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. హీరో శర్వానంద్ మెడలో దండలు వేసుకుని, చేతిలో రిలీజ్ డేట్ బోర్డు పట్టుకుని కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయనకు అటు ఇటు హీరోయిన్లు సంయుక్త, సాక్షి వైద్య నిలబడి ఉన్నారు. వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే హీరో పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని, ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ డ్రామా అని హింట్ ఇస్తున్నారు.