సినీ నటి నివేదా పేతురాజ్ వివాహంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆమె నిశ్చితార్థం రద్దయిందని తెలుస్తోంది.
నివేదా పేతురాజ్
సినీ నటి నివేదా పేతురాజ్ వివాహంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆమె నిశ్చితార్థం రద్దయిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, తాజాగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించడంతో వీరి పెళ్లి రద్దయిందనే ఊహాగానాలు బలపడ్డాయి. గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న నివేదా.. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకే సినిమాలకు విరామం ఇచ్చారని భావించారు. ఆగస్టులో నిశ్చితార్థం జరగడంతో ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే, ఉన్నట్టుండి ఇద్దరూ తమ ఫొటోలను డిలీట్ చేయడంతో వారి మధ్య బ్రేకప్ జరిగిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.