‘కలర్ ఫొటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం మౌగ్లీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
సందీప్ రాజ్
‘కలర్ ఫొటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం మౌగ్లీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కలర్ ఫొటో, మౌగ్లీ వంటి సినిమాలు నాకు బదులుగా మరొక దర్శకుడికి తీయాల్సింది. ఈ రెండు చిత్రాలు.. సినిమా అంటే పడి చచ్చి, పని పట్ల ఎంతో నిబద్ధత, అభిరుచి ఉన్న వ్యక్తుల బృందమేతీసింది. ఈ రెండు సినిమాల్లో ఉన్న రెండు కామన్ విషయాలు ఏంటంటే.. అన్నీ బాగా జరుగుతున్నాయని అనుకున్న సమయంలో వాటి విడుదల విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం. ఇంకోటి.. ‘నేను’ అని తెలిపాడు. ‘బహుశా ఆ బ్యాడ్ లక్ నేనేనేమో. నాకు కూడా అలాగే అనిపించడం మొదలైంది. థియేటర్‌లలో దర్శకత్వం: సందీప్ రాజ్ అనే టైటిల్‌ను చూసే నా కల రోజురోజుకూ కష్టమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. మౌగ్లీ సినిమా రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, భైరవ వంటి ఎంతో మంది అంకితభావం ఉన్న వ్యక్తుల కష్టం, చెమట, రక్తంతో తయారైంది. కనీసం వారి కోసమైనా మౌగ్లీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.