సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజనీ కెరీర్‌లో సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ నరసింహ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ-రిలీజ్ అవుతోంది.
నీలాంబరి
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజనీ కెరీర్‌లో సంచలనం సృష్టించిన బ్లాక్‌బస్టర్ నరసింహ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ-రిలీజ్ అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘నరసింహ సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో తీసే ఆలోచనలో ఉన్నాం’ అని తెలిపారు. అయితే అభిమానుల్లో ఒక్క సందేహం కలిగింది. చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర క్లైమాక్స్‌లో మరణిస్తుంది. మరి సీక్వెల్‌ను ఎలా తీర్చిదిద్దుతారు? ఫ్లాష్‌బ్యాక్ లేదా కొత్త యాంగిల్‌తో వస్తారా? అన్న చర్చ మొదలైంది. నీలాంబరి పాత్ర ఇప్పటికీ కల్ట్. రమ్యకృష్ణ అద్భుత నటన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్ వస్తే ఫ్లాష్‌బ్యాక్ కథనంగా ఉండవచ్చు. లేదా నీలాంబరి పేరుతో పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తీసే అవకాశం ఉంది.