బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది ఈ భామ.
దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది ఈ భామ. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో దీపిక భాగం కాబోతున్నట్లు సమాచారం. దర్శకుడు అమర్ కౌశిక్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి తీస్తున్న ‘మహావతార్’ సినిమాలో దీపికను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరుపగా దీపికా కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోందట.