త్రీ ఇడియట్స్ సీక్వెల్‌పైఅదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. స్రిప్ట్ ఫైనల్ అయింది. టీం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది.
3 ఇడియట్స్
త్రీ ఇడియట్స్ సీక్వెల్‌పైఅదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. స్రిప్ట్ ఫైనల్ అయింది. టీం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని నటీనటులు భావిస్తున్నారు. సుమారు 15 ఏండ్ల తర్వాత కథలోని పాత్రలు క్లైమాక్స్ సీన్‌లో మళ్లీ కలిసి కొత్త అడ్వెంచర్‌ను మొదలుపెడతాయని తాజా కథనం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్‌తో చేయబోయే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ నిలిచిపోవడంతో ఈ డైరెక్టర్ త్రీ ఇడియట్స్ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. రాజ్ కుమార్ హిరానీ త్రీ ఇడియట్స్ సీక్వెల్‌ను పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట.