వచ్చేశాడు కింగ్..!

వచ్చేశాడు కింగ్..!

virat kohli

 విరాట్ కోహ్లీ

భారత మాజీ కెప్టె్న్ విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అర్ధ శతకంతో మెరిసిన విరాట్ ఈసారి స్వదేశంలో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ స్క్వాడ్‌లో ఒకడైన కోహ్లీ ముంబై చేరుకున్నాడు. ఆసీస్ పర్యటన తర్వాత లండన్‌లోనే ఉండిపోయిన అతడు మంగళవారం సొంతగడ్డకు తిరిగొచ్చాడు. నలుపు రంగు ప్యాంట్.. చాక్లెట్ కలర్ షర్ట్.. తలకు టోపీ.. కళ్లద్దాలు పెట్టుకొని సింపుల్‌ లుక్‌లో కనిపించిన రన్ మెషీన్ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగాడు. నిరుడు టీ20లకు.. ఈ ఏడాది జూన్‌లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్న విరాట్ ఆస్ట్రేలియా పర్యటనలో రెండు మ్యాచుల్లో సున్నాకే ఔటైనా.. సిడ్నీ వన్డేలో అర్ధ శతకంతో రాణించాడు. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై బ్యా్ట్ ఝులిపించేందుకు ముంబై చేరుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం 50 ఓవర్ల ఆటలో 51 శతకాలు.. 75 హాఫ్ సెంచరీలు బాదిన అతడు.. సఫారీలపై చెలరేగితే మరిన్ని రికార్డులు బద్ధలవ్వడం ఖాయం. నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనున్నందున.. కోహ్లీ త్వరలోనే స్క్వాడ్‌తో కలువనున్నాడు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్