కెప్టెనే చేతులెత్తేసాడు: అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా తాత్కలిక టెస్ట్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో ఆటగాళ్ల కన్నా ముందే రిషభ్ పంత్ చేతులెత్తేసాడని తెలిపాడు. నాలుగో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్‌ను ఉద్దేశించి అశ్విన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుంటామనే ఆశ నాకు ఉంది. కానీ మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ తీవ్ర బాధకు గురి చేస్తోంది.'అని గుండె పగిలే ఎమోజీతో కెప్టెన్ రిషభ్ పంత్ ఫొటో పెట్టాడు. ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ రిషభ్ పంతే భుజాలు దిగేసాడనే విషయాన్ని అశ్విన్ తెలియజేశాడు