ఫిబ్రవరి 15న బిగ్ ఫైట్

ఫిబ్రవరి 15న బిగ్ ఫైట్

2026  T20 schedule released

ప్రతీకాత్మక చిత్రం

ఆ రోజే దాయాదుల పోరు

టీ20 ప్రపంచకప్‌-2026 షెడ్యూల్‌ విడుదల

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగబోయే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరితే కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి), శ్రీలంకలోని మూడు వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

- ఫిబ్రవరి 7న భారత్ - అమెరికా మధ్య మ్యాచ్

- ఫిబ్రవరి 12న భారత్ - నమీబియా మ్యాచ్

- ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్

- ఫిబ్రవరి 18న భారత్ - నెదర్లాండ్స్ మ్యచ్


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్