కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వెంకటేశ్ ప్రసాద్!

కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వెంకటేశ్ ప్రసాద్!

 venkatesh prasad

వెంకటేశ్ ప్రసాద్

కర్ణాటక క్రికెట్ సంఘం తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దాదాపు ఖరారైనట్టే. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న జరగాల్సిన ఎన్నికలకు ముందే ప్రసాద్ విజయం ఖాయమైంది. ఇతరుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఆయన ఎంపికకు మార్గం సుగమమైంది. దాంతో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే బలపరిచిన ఆయన ఏకగ్రీవంగా ఎంపికవ్వడం లాంఛనమే అనిపిస్తోంది. గతంలో ప్రసాద్ 2010 నుంచి 2013 వరకూ కేఎస్‌సీఏ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాలి. కానీ, ఎన్నికల నిర్వహణాధికారి డాక్టర్.బి. బసవరాజు (మాజీ ఐఏఎస్) క్రికెట్ సంఘం నిర్వహణ కమిటీ నుంచి స్పష్టత లేదని.. వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలని పట్టుపట్టారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజు డిసెంబర్ 7న ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. అధ్యక్ష పదవి కోసం గేమ్ ఛేంజర్స్ టీమ్ నుంచి వెంకటేశ్‌ ప్రసాద్‌, టీమ్ బ్రిజేశ్ నుంచి కే.ఎన్. శాంత్ కుమార్, కల్పన వెంకటాచార్ నామినేషన్ వేశారు. కానీ, సాంకేతిక కారణాలతో శాంత్ దరఖాస్తును ఎన్నికల అధికారి తిరస్కరించారు. వెంకటాచార్ తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్