కోహ్లీ 100 సెంచరీలు చేస్తాడు: గవాస్కర్

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని వెటరన్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.

Sunil Gavaskar

సునీల్ గవాస్కర్ 

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని వెటరన్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు. ‘ఎందుకు సాధ్యం కాదు? కోహ్లీ ఇంకా కనీసం మూడు సంవత్సరాలు ఆడినా వందకు చేరేందుకు 16 సెంచరీలు అవసరం. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ మరో రెండు శతకాలు చేస్తే అప్పుడు విరాట్ సెంచరీల సంఖ్య 86కు చేరుతుంది. 2027 వరల్డ్‌కప్‌ ముగిసేనాటికి భారత్‌ దాదాపు 35 వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. కోహ్లీ వీటన్నింటిలో ఆడి ఇదే ఫామ్‌ కొనసాగిస్తే 100 సెంచరీలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ తన బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వన్డేల్లో విరాట్ టీ20 క్రికెట్‌ మాదిరిగానే ఆడటం చాలా అరుదుగా చూశాం. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు నెల రోజుల విరామం దొరికింది. ఈ గ్యాప్‌లో అతని ఫామ్ ఏమవుతుందో చూడాలి. ఈ విరామం లేకపోతే కివీస్‌తో సిరీస్‌లో కచ్చితంగా రెండు లేదా మూడు సెంచరీలు సాధించేవాడు అని నేను కచ్చితంగా అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.


రావణ రహస్యం...రావణ లంక దొరికింది...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్