దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం విరాట్ కోహ్లీ స్టేడియంలో వ్యక్తం చేసి హావభావాలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్
దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం విరాట్ కోహ్లీ స్టేడియంలో వ్యక్తం చేసి హావభావాలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సహచర ఆటగాళ్లు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఉత్సాహంగా ఆలింగనం చేసుకున్న విరాట్ కోహ్లీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కేవలం కరచాలనంతోనే సరిపెట్టడం పలు అనుమానాలకు దారితీసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ (302 పరుగులు, 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ) అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే జట్టు విజయం తర్వాత ఆటగాళ్ల మధ్య జరిగే సహజమైన కౌగిలింతలు, ఆత్మీయ పలకరింపుల సమయంలోనే ఈ 'వివాదం' వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ ముగిశాక, విరాట్ కోహ్లీ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందిని కలుస్తూ వచ్చాడు. సహచర ఆటగాళ్లందరినీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను, విరాట్ నవ్వుతూ, ఉల్లాసంగా కౌగిలించుకున్నాడు. ఈ సన్నివేశాలు ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలను స్పష్టం చేశాయి. కానీ కోహ్లీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలుస్తున్నప్పుడు అతని హావభావాలు స్పష్టంగా మారిపోయాయి. కోహ్లీ గంభీర్‌ను కౌగిలించుకోకుండా, కేవలం కరచాలనం చేయడంతోనే సరిపెట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు దీన్ని చూసి గంభీర్, కోహ్లీల మధ్య మరోసారి విభేధాలు నెలకొన్నట్లు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన ఈ మార్పు, హెడ్ కోచ్‌తో కోహ్లీకి ఉన్న విభేదాలనుమరోసారి బహిర్గతం చేసిందని విశ్లేషిస్తున్నారు.