స్మృతి-పలాష్ పెళ్లి క్యాన్సిల్

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అధికారికంగా రద్దయింది. చాలా సస్పెన్స్ తర్వాత స్మృతి మంధాన తొలిసారి మౌనం వీడింది.

smriti mandhan palash wedding cancelled

 స్మృతి మంధాన పలాష్ ముచ్చల్

మాజీ లవ్ బర్డ్స్ అధికారిక ప్రకటన

మా దారులు వేరు అని వెల్లడి

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అధికారికంగా రద్దయింది. చాలా సస్పెన్స్ తర్వాత స్మృతి మంధాన తొలిసారి మౌనం వీడింది. తన పెళ్లి క్యాన్సిల్ అయిందని అధికారికంగా ప్రకటించింది. తమ కుటుంబాలు వివాహాన్ని రద్దు చేశాయని పేర్కొంది. ‘గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే వదలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా తరఫున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది తన దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుందని, దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. ‘నాకు ఎల్లప్పుడూ ఉన్నతమైన లక్ష్యం ఉంది. అదే అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను వీలైనంత కాలం భారత్ తరఫున ఆడాలని, ట్రోఫీలను గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ దానిపైనే ఉంటుంది. మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది’ అని తెలిపింది.

స్పందించిన పలాష్ ముచ్చల్

క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహాన్ని రద్దు చేసిన తర్వాత సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ స్పందించారు. తన వ్యక్తిగత సంబంధం నుంచి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు పలాష్ తెలిపారు. అలాగే తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ తనను అప్రతిష్టపాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కష్టకాలం తన జీవితంలో అత్యంత కష్టమైన దశ అని పేర్కొంటూ.. తన వ్యక్తిగత సంబంధం నుంచి తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ‘నేను నా జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నాకు అత్యంత పవిత్రమైన విషయంపై నిరాధారమైన పుకార్లకు ప్రజలు ఇంత సులభంగా స్పందించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ, నేను నా నమ్మకాలను కాపాడుకుంటూ దీన్ని ఎదుర్కొంటాను. ప్రతి ఒక్కరూ ధ్రువీకరించని గాసిప్‌ల ఆధారంగా ఇతరులను అంచనా వేయడానికి ముందు ఒకసారి ఆలోచించడం నేర్చుకోవాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. మన మాటలు మనకు తెలియని విధంగా ఇతరులను గాయపరచవచ్చు. నాపై తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై నా బృందం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో దయతో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.


రావణ రహస్యం...రావణ లంక దొరికింది...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్