టీమిండియాకు సౌతాఫ్రికా కోచ్ షఉక్రి కాన్రాడ్ క్షమాపణలుచెప్పాడు. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సందర్భంగా సఫారీ కోచ్ షుక్రి కాన్రాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
షఉక్రి కాన్రాడ్
టీమిండియాకు సౌతాఫ్రికా కోచ్ షఉక్రి కాన్రాడ్ క్షమాపణలుచెప్పాడు. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సందర్భంగా సఫారీ కోచ్ షుక్రి కాన్రాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్లేయర్లు సాష్టాంగ నమస్కారం చేసే వరకు డిక్లేర్ ఇవ్వబోమంటూ కామెంట్ చేశారు. ఆ సందర్భంగా గ్రోవెల్ అనే పదాన్ని వాడారు దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు షుక్రి కాన్రాడ్. ఆ పదాలను ఉపయోగించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి దురుద్దేశంతో ఆ కామెంట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. భారతీయులు అంటే తమకు అభిమానమని పేర్కొన్నారు. ‘ఎవరినీ కించపరచాలని ఆ పదం వాడలేదు, ఆ పదం స్థానంలో వేరే పదాన్ని వాడితే సరిపోయేది’ అంటూ వెల్లడించారు. ఇకపై తన భాష పట్ల చాలా జాగ్రత్తగా ఉంటానని వివరించారు. నా వ్యాఖ్యల నేపథ్యంలో వన్డే సిరీస్ ను ఇండియా చాలా కసిగా ఆడినట్లు వెల్లడించారు. ఇక ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చాలా ఆసక్తిగా మారబోతోందని స్పష్టం చేశారు.