నా కొడుకే పెళ్లి వాయిదా వేసాడు: పలాశ్ తల్లి

నా కొడుకే పెళ్లి వాయిదా వేసాడు: పలాశ్ తల్లి

Smriti Mandhana wedding

ప్రతీకాత్మక చిత్రం

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్మృతి మంధాన స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో గత ఆదివారం(నవంబర్ 23)మధ్యాహ్నం ఈ పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన స్మృతి మంధాన.. వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించిందని ఆమె మేనేజర్ ప్రకటించారు. అంతేకాకుండా స్మృతి మంధాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వివాహానికి సంబంధించిన పోస్ట్‌లను తొలగించింది. దాంతో ఈ పెళ్లిపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురయ్యాడని ప్రచారం జరిగింది. అయితే పెళ్లి కేవలం వాయిదా పడిందని, ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని పలాష్ ముచ్చల్ సోదరి, సింగర్ పలాక్ ముచ్చల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పెళ్లిపై పుకార్లను పుట్టించడం ఆపాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పెళ్లి వాయిదా నిర్ణయం స్మృతి మంధానది కాదని, తన కొడుకుదేనని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తాజాగా ఓ జాతీయా ఛానెల్‌కు తెలిపారు. స్మృతి మంధాన తండ్రితో పలాష్ ముచ్చల్‌కు మంచి సాన్నిహిత్యం ఉందని, ఆయన అస్వస్థతకు గురవ్వడాన్ని తట్టుకోలేకపోయాడని స్పష్టం చేశారు. స్మృతి మంధాన కంటే ముందే పెళ్లిని వాయిదా వేయాలని చెప్పాడని వెల్లడించారు. 'పలాష్ ముచ్చల్‌కు స్మృతి తండ్రితో మంచి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరూ స్మృతి కంటే ఎక్కువగా క్లోజ్ ఉండేవారు. ఆయన అస్వస్థతకు గురవ్వగానే స్మృతి కంటే ముందే పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కోలుకునేవరకు పెళ్లిని వాయిదా వేయాలని చెప్పారు. ఇలా పెళ్లికి ఆటంకం కలగడంతో నా కొడుకు ఎంతో ఏడ్చాడు. దాంతో అతని అతని ఆరోగ్యం క్షీణించింది. నాలుగు గంటల పాటు అతన్ని ఆసుపత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. అతనికి ఐవీ డ్రిప్ ఇచ్చారు. ఈసీజీ తీసారు. ఇతర పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. కానీ తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడు.ప్రస్తుతం మేం ముంబైలోని మా ఇంటికి వచ్చేసాం. పలాష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. పలాష్ సోదరి పలాక్ కూడా అతనితో ఇంటికి వచ్చేసింది. అంతా సర్దుకున్న తర్వాతే స్మృతి నా కొడుకు పెళ్లి జరుగుతుంది.'అని అమితా చెప్పుకొచ్చింది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్