మొత్తానికే స్మృతి పెళ్లి క్యాన్సిల్!?

మొత్తానికే స్మృతి పెళ్లి క్యాన్సిల్!?

Smriti Mandhana

స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన  వివాహం చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఆ తర్వాత స్మృతికి కాబోయే భర్త పలాశ్‌ ముచ్చల్‌ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో క్రికెటర్‌ పెళ్లి విషయంలో తాజాగా మరో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిన్నటి వరకూ పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్మృతి మంధాన.. ఇప్పుడు వాటిని డిలీట్‌ చేసింది. ఆమె ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను తొలగించింది. అంతేకాదు మంధాన తన నిశ్చితార్ధం ఉంగరాన్ని చూపిస్తూ తన టీమ్‌మేట్స్‌తో చేసిన ప్రత్యేక వీడియోని కూడా ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించింది. ఈ విషయంపై స్మృతి, ఆమె ఫ్యామిలీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్