జిమ్‌లో శ్రేయస్ అయ్యర్

జిమ్‌లో శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer

శ్రేయస్ అయ్యర్

గాయం నుంచి కోలుకుంటున్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ మైదానంలోకి  అడుగుపెట్టడంపై దృష్టిసారించాడు. అతను జిమ్‌లో నెమ్మదిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు. ఎక్సర్‌సైజ్ బైక్‌పై వ్యాయామం చేస్తున్న ఫొటోను శ్రేయస్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అతను వీలైనంత త్వరగా భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నారు. గత నెల చివరలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్‌ అందుకొనే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి చికిత్స అందించారు. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో రెండు రోజులు ఐసీయూలో ఉండి చికిత్స చేయించుకున్న అతను.. అక్కడి నుంచి డిశ్చార్జి అయి స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి డాక్టర్ దిన్షా పార్దివాలా.. అయ్యర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.  ఇటీవల అతను అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించుకోగా.. మెరుగుదల కనిపిస్తున్నట్లు చెప్పారు. అయితే  కడుపుపై ఒత్తిడిని కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలకు పైగానే సమయం పడుతుందట. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా అతను అందుబాటులోకి రాడట. ఫిట్‌నెస్‌ సాధించినా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు కాబట్టి ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ ఎంపికకు శ్రేయస్‌ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే. బహుశా మళ్లీ ఐపీఎల్‌లోనే అతణ్ని మైదానంలో చూస్తామేమో!


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్