ఇంత చెత్త బ్యాటింగ్ ఊహించలేదు: రవిశాస్త్రి
రవిశాస్త్రి
గౌహతి తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన టీమిండియాపై మాజీ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. మంచి వికెట్ మీద భారత క్రికెటర్లు పేలమైన బ్యాటింగ్ చేశారని తీవ్రంగా విమర్శించాడు శాస్త్రి. గువాహటి టెస్టుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. బౌలింగ్‌లో తేలిపోయిన భారత జట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటకపోవడమే అందుకు కారణం. తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవ్వడంపై అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పట్టుదలగా క్రీజులో నిలవాల్సిన టాపార్డర్, మిడిలార్డర్ చెత్త ఆటతో పేస్‌కు దాసోహమవ్వడం విమర్శలకు తావిస్తోంది. కామెంటరీ బాక్స్‌లో నుంచి మ్యాచ్‌ను వీక్షించిన రవి శాస్త్రి మరీ చెత్తగా ఆడారని విమర్శించాడు. ‘మూడో రోజు కూడా గువాహటి వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. అయినా సరే మనవాళ్లు చాలా సాధారణమైన బ్యాటింగ్ చేశారు. 122కే 7 వికెట్లు పడాల్సిన వికెట్ అయితే కాదని కచ్చితంగా చెప్పగలను. తమ ప్రదర్శన పట్ల భారత ఆటగాళ్లు ఏమాత్రం సంతోషంగా ఉండరు. ప్లేయర్లంతా చేతులు పైకెత్తి నిజంగా మేము చాలా పేలవమైన ఆట ఆడాం అని మనస్ఫూర్తిగా అంగీకరించాలి’ అని రవి శాస్త్రి అన్నాడు.