జయహో భారత్!

రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతగా నిలిచాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత పురుషుల జట్టు 11-10 తేడాతో, మహిళల జట్టు 3-2 తేడాతో కెన్యా పురుషుల, మహిళల జట్లను ఓడించాయి.

roll ball world cup 2025

ప్రతీకాత్మక చిత్రం

రోల్ బాల్ వరల్డ్ కప్‌లు మనవే

విజేతలుగా పురుష, మహిళల జట్లు

రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతగా నిలిచాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత పురుషుల జట్టు 11-10 తేడాతో, మహిళల జట్టు 3-2 తేడాతో కెన్యా పురుషుల, మహిళల జట్లను ఓడించాయి. ఈ గెలుపుతో ప్రపంచకప్ టైటిల్స్‌ను ముద్దాడాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ కెన్యా భారత పురుషుల జట్టుకు గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో భారత్‌ వెనుకంజలో నిలిచినప్పటికీ.. పుంజుకుని ఈ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది భారత పురుషుల జట్టుకు 5వ ప్రపంచకప్ టైటిల్. మహిళలకు మూడో ప్రపంచకప్ టైటిల్. ఈ మెగా ఈవెంట్‌లో భారత్, కెన్యా, పోలాండ్, అర్జెంటీనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలు పాల్గొన్నాయి. 2023లో పూణేలో జరిగిన ప్రపంచకప్‌లో కెన్యా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి దుబాయ్ గడ్డపై భారత్ రెండు విభాగాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. భారత మూలాలున్న ఈ క్రీడలో మన జట్లు ప్రపంచ స్థాయి ఆధిపత్యాన్ని చెలాయించాయి. భారత పురుషుల జట్టు విజయంలో రోహన్ దాభాడే, హితేష్ సింగ్, యష్ రాశియా, హర్షల్ ఘుగే కీలక పాత్ర పోషించాడు. రోలా బాల్ అనేది భారత్‌లో పుట్టి వినూత్నమైన క్రీడ. సింపుల్‌గా చెప్పాలంటే.. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, రోలర్ స్కేటింగ్ కలిసిన ఆట. ఈ క్రీడలో ఆటగాళ్ళు రోలర్ స్కేట్స్ ధరించి, బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ఎదుటి జట్టు గోల్ పోస్ట్‌లోకి పంపాలి. ప్రతి జట్టులో 12 మంది ఆటగాళ్ళు ఉంటారు. కానీ మైదానంలో ఒకేసారి 6 మంది మాత్రమే ఆడతారు. ఇందులో ఒక గోల్ కీపర్ ఉంటాడు. ఆటగాళ్ళు స్కేటింగ్ చేస్తూ బంతిని చేత్తో పట్టుకుని బాస్కెట్ బాల్‌ తరహాలో డ్రిబ్లింగ్ చేయాలి. బంతిని ఒక చేత్తో లేదా రెండు చేతులతో పాస్ చేయవచ్చు. కానీ గోల్ వేసేటప్పుడు మాత్రం ఒక చేయి మాత్రమే ఉపయోగించాలి. నిర్ణీత సమయంలో ఏ జట్టు ఎక్కువ గోల్స్ చేస్తే ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. భారత్‌లో పుట్టిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఆడుతున్నారు.


హే రామ్.. జీ రామ్!...ఎంజీ నరేగా పేరు మార్పు...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్