ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో డీఆర్‌ఎస్ విషయంలో తీవ్ర దుమారం రేగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో డీఆర్‌ఎస్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. సాంకేతిక లోపం కారణంగా ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఏకంగా శతకంతో చెలరేగాడు. ఇది ఇంగ్లండ్ జట్టుకు తీవ్ర నష్టం చేసింది. అలెక్స్ క్యారీ సెంచరీతో తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆట అనంతరం అలెక్స్ క్యారీ డీఆర్‌ఎస్ వివాదాంపై స్పందించాడు. తాను ఔటయ్యాననే విషయం తెలుసని, అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ సాధించానని చెప్పాడు.