అంపైర్లకు బుద్ధి లేదు: ఊతప్ప

అంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దయ్యిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్లు ఇంకిత జ్ఞానం లేకుండా వ్యవహరించారని మండిపడ్డాడు.

rabin uthappa

రాబిన్ ఊతప్ప 

అంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దయ్యిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్లు ఇంకిత జ్ఞానం లేకుండా వ్యవహరించారని మండిపడ్డాడు. బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ విపరీతమైన పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ సమయానికే మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో పలు మార్లు మైదానాన్ని పరిశీలించి, విజిబిలిటిని పరీక్షించిన అంపైర్లు చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాబిన్ ఊతప్ప.. జియో హాట్‌స్టార్ లైవ్‌లో అంపైర్ల తీరును తప్పుబట్టాడు. 'అంపైర్ల నిర్ణయం నాకు ఆశ్చర్యానికి కలిగించింది. రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే.. సమయం గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఎలా అనుకుంటున్నారు? మనం మరో అరగంట వేచి ఉంటే ఏం జరుగుతుంది. పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. నేను ఇంతకంటే దారుణమైన పొగమంచు మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. కానీ అంపైర్లు ఆటను ప్రారంభించకుండా సమయాన్ని వృథా చేయడం కోపం తెప్పిస్తుంది.'అని రాబిన్ ఊతప్ప తెలిపాడు. అంపైర్ల తీరు తనకు కూడా అర్థం కావడం లేదని సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ అన్నాడు. 'అంపైర్లు ఏ నియమాన్ని పాటిస్తున్నారో నాకు తెలియదు. ఒక ఆటగాడిగా.. ఈ వాతావరణంలో ఆడటం పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. అంపైర్లలో ఒకరు వచ్చి మ్యాచ్ ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తే బాగుంటుంది.'అని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. పొగమంచుతో పాటు మైదానం గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించాడు. కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితమయ్యారు. రాత్రి 9.30 గంటలకు చివరిసారిగా మైదాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐపై మండిపడుతున్నారు. పొగమంచు కురిసే ప్రదేశాల్లో మ్యాచ్‌లు ఎందుకని, సౌత్ ఇండియాలో చాలా మైదానాలు అనుకూలంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


జయహో భారత్!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్