ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ టెస్ట్ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో నాథన్ లయన్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు.
నాథన్ లయన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ టెస్ట్ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో నాథన్ లయన్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాథన్ లయన్ ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నారు. గురువారం నాటి ఆటలో నాథన్ లయన్ రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా తన కెరీర్ టెస్ట్ వికెట్ల సంఖ్యను 564కి చేర్చుకున్నారు. తద్వారా 563 వికెట్లు తీసిన మెక్‌గ్రాత్‌ను వెనక్కి నెట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓలీ పోప్, బెన్ డకెట్‌లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ద్వారా నాథన్ లయన్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్(708) తర్వాత లయన్ రెండో స్థానంలో నిలిచారు. నాథన్ లయన్ తన రికార్డును అధిగమించగానే కామెంటరీ బాక్సులో ఉన్న గ్లెన్ మెక్‌గ్రాత్ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన రికార్డు బ్రేక్ అయినందుకు సరదాగా కోపం నటిస్తూ.. అక్కడే ఉన్న ఒక కుర్చీని విసిరేయబోతున్నట్లు మెక్‌గ్రాత్ సైగ చేశాడు. ఆ తర్వాత వెంటనే నవ్వుతూ నాథన్ లయన్‌ను అభినందించారు.