సింహాచలం అప్పన్న సేవలో కోహ్లీ

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సింహాచలం వరాహ లక్ష్మీ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడేందుకు వచ్చిన విరాట్‌.. ఆదివారం ఆలయానికి చేరుకున్నారు.

virat kohli

విరాట్‌ కోహ్లీ

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సింహాచలం వరాహ లక్ష్మీ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడేందుకు వచ్చిన విరాట్‌.. ఆదివారం ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో విరాట్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందించి, శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారికి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా విరాట్‌ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకొని ఎంతో పారవశ్యానికి లోనైనట్లు విరాట్ తెలిపాడు. దర్శనం చేయించినందుకు, తీర్థ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందించినందుకు ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు.


రావణ రహస్యం...రావణ లంక దొరికింది...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్