నేనుంటే బాగుండు: కరుణ్ నాయర్

నేనుంటే బాగుండు: కరుణ్ నాయర్

karun nair

కరుణ్ నాయర్

రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అసహనం వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉండి ఉంటే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ప్రస్తావన తీసుకురాకుండా పరోక్షంగా తన మనసులోని మాటను ట్వీట్ చేశాడు. 'కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో లేకపోతే మరింత బాధ కలుగుతుంది' అని ట్వీట్ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్.. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల్లో ఆడిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో భారత జట్టులో అవకాశం కోల్పోయాడు. భారత జట్టులో చోటు కోల్పోయినా.. రంజీల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. కర్ణాటక తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 100 సగటుతో 600 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్‌ను సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేయాల్సిందనే అభిప్రాయం కలుగుతోంది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్