ఆ నలుగురికి నిరాశే!...నేడే రెండో టీ20 మ్యాచ్...

సౌతాఫ్రికాతో తొలి టీ20లో దూకుడు మీద ఉన్న టీమిండియా.. రెండో టీ20 కోసం రెడీ అవుతోంది. న్యూ చండీగఢ్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

harshit washington sanju kuldeep to miss 2nd

ప్రతీకాత్మక చిత్రం

సౌతాఫ్రికాతో తొలి టీ20లో దూకుడు మీద ఉన్న టీమిండియా.. రెండో టీ20 కోసం రెడీ అవుతోంది. న్యూ చండీగఢ్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో టీ20లోనూ అదే జోరును కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు చెత్త బ్యాటింగ్‌తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సౌతాఫ్రికా.. రెండో టీ20లోనైనా గట్టి పోటీనివ్వాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి టీ20 విజయంతో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బ్యాట్ ఝలిపించాల్సి ఉంది. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ తీవ్రంగా నిరాశపర్చాడు. వన్డే, టెస్ట్‌ల్లో సత్తా చాటుతున్న గిల్.. టీ20ల్లో మాత్రం ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో 4 పరుగులే చేసి వెనుదిరిగాడు. రెండో టీ20లోనైనా అతను సత్తా చాటాలి. లేదంటే అతనిపై విమర్శలు ఎక్కువవుతాయి. ఫస్ట్ డౌన్‌లో ఆడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ ఏడాది సూర్య ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు. రెండో టీ20లోనైనా సూర్య సత్తా చాటాలి. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబేలు కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. తొలి టీ20లో హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. అతను అదే జోరు కొనసాగించాల్సి ఉంది. చివర్లో తనదైన శైలిలో ఫినిష్ ఇచ్చేందుకు జితేష్ సిద్దంగా ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీకి తిరుగులేదు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు కూడా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు. దాంతో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

భారత టీ20 టీమ్ 

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ,సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.


పిల్లల భవితకు బాటలేద్దాం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్