మహికాశర్మ వల్లే ఇదంతా: హార్దిక్ పాండ్యా

తన ప్రియురాలు మహికా శర్మ వల్లే సౌతాఫ్రికాతో తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చానని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

hardik pandya

హార్దిక్ పాండ్యా

తన ప్రియురాలు మహికా శర్మ వల్లే సౌతాఫ్రికాతో తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చానని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. సానుకూల దృక్పథమే తనను తిరిగి మైదానంలో అడుగు పెట్టేలా చేసిందని తెలిపాడు. ‘గాయం తర్వాత నేను మరింత దృఢంగా తిరిగి వచ్చాను. గాయాలు మనల్ని మానసికంగా పరీక్షిస్తాయి. బలంగా నిలబడటం వల్లే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. నిజానికి మనల్ని మనం కచ్చితంగా నమ్మాలి. మనమీద మనకే విశ్వాసం లేనప్పుడు ఇతరులు మనల్ని ఎలా నమ్ముతారు. మైదానంలో దిగిన ప్రతీ క్షణాన్ని, ఆటను ఆస్వాదించాలనుకున్నా. జనాలను ఆకట్టుకునేలా ఆడాలనుకోవడమే నాకు అసలైన ప్రేరణ. అలాగే నేను రాణించడానికి నా ప్రియురాలు కూడా ఓ కారణం. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది’ అని హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మ గురించి చెప్పుకొచ్చాడు.


ఒక్కో ఓటు - పల్లె భవిష్యత్తు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్