అతడు సిక్సర్ల రారాజు: సౌతాఫ్రికా కోచ్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్వెల్ ప్రిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ashwell prince

ఆష్వెల్ ప్రిన్స్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్వెల్ ప్రిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా సిక్సర్ల రారాజు అని, ఏ బంతిని ఆడాలనే విషయంలో మంచి అనుభవం ఉందని కొనియాడాడు. ‘హార్దిక్ పాండ్యా సిక్సర్ల రారాజు. అతను సిక్సర్లు కొట్టడమే కాదు. ఏ బంతిని కొట్టాలో.. ఏ బంతిని వదిలేయాలో కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం, పరిణితి అతనికి ఉంది. ఇది సుదీర్ఘ అనుభవంతో మాత్రమే వస్తుంది. బంతి అతని యార్క్‌లో పడితే ఎలాంటి సంకోచం లేకుండా బౌండరీకి తరలిస్తాడు. చాలా క్లారిటీతో బ్యాటింగ్ చేస్తాడు. అతని ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అతను షాట్ ఆడే విధానం అద్భుతంగా ఉంటుంది’ అని ఆష్వెల్ ప్రిన్స్ తెలిపాడు.


పిల్లల భవితకు బాటలేద్దాం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్