అసెంబ్లీలో నేనే సీనియర్: ఉత్తమ్
ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): ప్రస్తుత శాసనసభలో తానే సీనియర్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తనకంటే సీనియర్ అయినప్పటికీ సభకు రావడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చే వారిలో మాత్రం తాను సీనియర్ నాయకుడినని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏడుసార్లు ఒకే పార్టీ బీఫామ్‌పై గెలిచిన వ్యక్తిని తానే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని పేర్కొన్నారు.