ఈసీ ఎక్కడ?

ఈసీ ఎక్కడ?

srinivas goud

శ్రీనివాస్‌ గౌడ్‌

ఉందా? నిద్రపోయిందా?

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్

హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): ప్రభుత్వం ఇచ్చినచీర కట్టుకొని ఓట్లు వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకొని ఓటు వేయండని బహిరంగంగా ముఖ్యమంత్రి అంటున్నారని. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఎక్కడకు పోయింది? ఉందా నిద్రపోయిందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఉంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందని విమర్శించారు. రెండేళ్ల నుంచి ఎక్కడకు పోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎక్కడకు పోయాయని నిలదీశారు. అవ్వ తాతకు ఇస్తానని చెప్పిన పెన్షన్ ఎక్కడకు పోయిందని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగులకు బీసీ రిజర్వేషన్ల పై మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎన్నో రకాల మోసాలను ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఒక్క బీసీ సర్పంచ్ లేడు అని.. మహబూబ్‌నగర్‌లో చాలా గ్రామాల్లో బీసీ సర్పంచ్‌లు లేరు, వార్డు మెంబర్లు లేరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డు మెంబర్లకు ఇస్తారని.. సర్పంచ్‌లకు మాత్రం అది ఇవ్వరని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎక్కడ నియమ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్