కర్నూలులో హైకోర్టు బెంచ్

కర్నూలులో హైకోర్టు బెంచ్

kurnool high court

ప్రతీకాత్మక చిత్రం


కర్నూలు, నవంబర్ 25 (ఈవార్తలు): రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై ఆ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ఈ అంశంపై స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నూలు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ క్వార్టర్స్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల వద్ద అనైతిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, రచ్చ చేసే వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు. "అవసరమైతే కర్రతో సమాధానం చెబుతాం" అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలు మెడికల్ కళాశాల మసీదు వద్ద నూతన రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ అవసరం ఉందని, త్వరలోనే మరిన్ని చోట్ల అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చా


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్