కొడంగల్ లిఫ్ట్ పేరు మార్పు

కొడంగల్ లిఫ్ట్ పేరు మార్పు

Narayanpet irrigation project update

ప్రతీకాత్మక చిత్రం


హైదరాబాద్, నవంబర్ 25 (ఈవార్తలు): రాష్ట్ర నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పేరును ‘మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 45ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఈ పేరు మార్పు తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించారు. అయితే.. ప్రాజెక్టు పేరులో తమ ప్రాంతానికి కూడా ప్రాధాన్యం దక్కాలని మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. గతంలో శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ పేరు మార్పు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్