ఎక్కువ కాలం బతికేస్తున్నాం!

ఎక్కువ కాలం బతికేస్తున్నాం!

global health trends

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆయుర్దాయం

భారత్‌లోనూ పరిస్థితి మెరుగు.. 72 ఏళ్లకు ఆయుష్షు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం గత ఆరు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. మెరుగైన వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 1960లో ప్రపంచ సగటు ఆయుర్దాయం 51 సంవత్సరాలు కాగా, 2023 నాటికి అది 73.3 ఏళ్లకు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా కొద్దిపాటి తగ్గుదల కనిపించినా, ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం గణాంకాల ప్రకారం, అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల్లో జపాన్ అగ్రస్థానంలో ఉంది. 1960లో అక్కడ సగటు ఆయుష్షు 68 ఏళ్లు కాగా, 2023 నాటికి అది 84 ఏళ్లకు పెరిగింది. ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఇది 83.7 ఏళ్లుగా నమోదైంది. పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మంచి ఆహారపు అలవాట్లే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో, అమెరికాలో ఆయుర్దాయం పెరుగుదల ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే నెమ్మదిగా ఉంది. 1960లో 70 ఏళ్లుగా ఉన్న ఆయుష్షు, 2023 నాటికి 78.4 ఏళ్లకు మాత్రమే చేరింది. ఊబకాయం, ఆరోగ్య సంరక్షణలో అసమానతలు వంటి సమస్యలు ఇందుకు కారణంగా ఉన్నాయి. మరోవైపు, చైనా ఈ విషయంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. 1960లో కేవలం 33 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్దాయం, 2023 నాటికి 78 ఏళ్లకు పెరిగి అమెరికాను దాదాపుగా సమీపించింది. ఇదే కాలంలో భారత్‌లో కూడా సగటు ఆయుర్దాయం గణనీయంగా మెరుగుపడింది. 1960లో 46 ఏళ్లుగా ఉన్న భారతీయుల సగటు ఆయుష్షు, 2023 నాటికి 72 ఏళ్లకు చేరింది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్