జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో వైజాగ్ వన్డే టికెట్లు

జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో వైజాగ్ వన్డే టికెట్లు

zomoto district app

ప్రతీకాత్మక చిత్రం

భారత్- సౌతాఫ్రికా మూడో వన్డే‌కు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 6న జరిగే ఈ మ్యాచ్‌ కోసం రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత వైజాగ్ వేదికగా భారత పురుషుల వన్డే మ్యాచ్ జరుగుతుండటం.. వెటరన్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌పై విపరీతమైన బజ్ నెలకొంది. దాంతో ఈ మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేసేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ల సేల్స్ గురించి తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మైదానం సీటింగ్ కెపాసిటీ 27,500 కాగా.. 22000 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు. నవంబర్ 28 నుంచి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ వేదికగా టికెట్లు సేల్ చేయనున్నారు. టికెట్ ధరలు రూ.1200, రూ.2000, రూ.2500, రూ.3000, రూ.3500, రూ.4000, రూ.5000, రూ. 10000, రూ.15000, రూ. 18000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్లన్నీ ఆన్‌లైన్ వేదికగానే అమ్మనున్నారు. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్