భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు
ప్రతీకాత్మక చిత్రం
మాస్కో: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ కు భారీ డిస్కౌంట్‌తో ఆయిల్ విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లపై అమెరికా విధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. దీంతో రష్యా ప్రధాన చమురు ఉరల్స్‌ను డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించేందుకు రష్యా సిద్ధమైంది. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు మూడు డాలర్లుగా ఉండగా, ఇప్పుడు రెండింతలు అయింది. తాజా తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయి జనవరిలో భారత్‌కు చేరే అవకాశం ఉంది.