జగిత్యాలలో మండలాలవారీగా షెడ్యూల్ విడుదల
సత్య ప్రసాద్
జగిత్యాల టౌన్, నవంబర్ 25 (ఈవార్తలు): స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నోడల్ ఆఫీసర్ లు ,ఆర్డీవోలు మరియు ఎంపిడివో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో.. మేడిపెల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్ పెల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నంలో, రెండవ విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో.. రాయికల్, బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, మల్యాల, కొడిమ్యాలలో, మూడవ విడత ఎన్నికలు 6 మండలాల్లో.. ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్, ఎండపెల్లి,పెగడపెల్లిలో జరుగుతాయని వెల్లడించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఫ్లెక్సీలు, స్టేషనరీ సంబంధించినవి బుధవారం మరోసారి సరి చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు.