10,000 ఏళ్లకు పేలిన హేలీ గుబ్బి అగ్నిపర్వతం

10,000 ఏళ్లకు పేలిన హేలీ గుబ్బి అగ్నిపర్వతం

10,000-year dormant volcano erupts

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఇథియోపియాలోని ఎర్టా ఆలే శ్రేణిలో ఉన్న హేలీ గుబ్బీ అగ్నిపర్వతం అత్యంత సుదీర్ఘకాలం తర్వాత, దాదాపు 10,000 సంవత్సరాలలో మొదటిసారిగా విస్ఫోటనం చెందింది. దీని నుంచి వెలువడిన బూడిద, పొగ ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ వైపు వ్యాపించాయి. ఈ ప్రాంత చరిత్రలో ఇది ఒక అసాధారణమైన అగ్నిపర్వత విస్ఫోటనమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికి కూడా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా వాతావరణంలోకి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, పొగ వ్యాపించింది. విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యలో అహ్మదాబాద్‌కు మళ్లించారు. హేలీ గుబ్బి విస్ఫోటనం కారణంగా ఆ ప్రాంతం మీదగా వెళ్లవలసిన విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్