నేడు మల్లెగుట్టపై షష్టి ఉత్సవాలు షురూ
ప్రతీకాత్మక చిత్రం
మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): మల్యాల గ్రామ శివారులోని మల్లెగుట్టపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నట్లు ఆలయ పూజారులు పేర్కొన్నారు. 7 వారాలపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు స్వామివారికి మైలపోలు, సుంకుబియ్యం, పెద్దపట్నం, స్వామివారి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.