నేడు అయోధ్యలో ధ్వజారోహణ

నేడు అయోధ్యలో ధ్వజారోహణ

PM Modi Ayodhya visit

ప్రతీకాత్మక చిత్రం

ప్రధాని చేతుల మీదుగా కార్యక్రమం

అయోధ్య: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మంగళవారం అయోధ్యలోని రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడం ద్వారా ద్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజారోహణ కోసం ఆలయంలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్లపంచమి రోజున అభిజిత్‌ ముహూర్తముననే ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. అంతేకాదు 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటలపాటు ధ్యానం చేసిన సిక్కుల ఆరో గురువు తేజ్‌ బహదూర్‌ అమరత్వం పొందిన రోజు కూడా అదే కావడం గమనార్హం. ధర్మంపై అధర్మం గెలుపునకు గుర్తుగా నాడు అయోధ్యలో ధ్వజారోహణ జరిగిందని, ఆ క్రమంలోనే ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ధ్వజారోహణ రోజు ఎగురవేసే కాషాయ జెండా గౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి, సంప్రదాయాలకు కొనసాగింపునకు, రామరాజ్య పాలనా వైభవానికి నిదర్శనాలని పేర్కొంది


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్