వైభవంగా పద్మావతి అమ్మవారి పంచమితీర్థం
ప్రతీకాత్మక చిత్రం
తిరుచానూరు, నవంబర్ 25 (ఈవార్తలు): తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించిన కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్రస్నానాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. వేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.