కోహెడగుట్టలో కామక్రీడలు

కోహెడగుట్టలో కామక్రీడలు

 Illegal activities in temples

ప్రతీకాత్మక చిత్రం

- అంజన్న సన్నిధిలో అసాంఘిక కార్యకలాపాలు

- 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయుడి సన్నిధి

- కోరిన కోర్కెలు తీర్చే చల్లని భగవంతుడిగా కీర్తి

- వెడ్డింగ్ షూట్స్‌కి స్పాట్‌గా కోహెడగుట్ట 

- దైవసన్నిధిలో అభ్యంతరకరంగా షూటింగ్స్

- దేవాలయ పరిసరాల్లో సిగరెట్లు, కండోమ్ ప్యాకెట్లు

- గుట్టపై చికెన్ పార్టీలు చేసుకుంటున్న చిల్లర బ్యాచ్

- ఆలయ పరిధిలో లోపించిన పర్యవేక్షణ, నియంత్రణ

భాగ్యనగరానికి సమీపంలోని ఆ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటకంగా పేరుగాంచింది. కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయుడిగా ఆ గుట్ట ఎంతో పేరొందింది. తన చెంతకు వచ్చే భక్తులకు అభయం ఇస్తున్నాడు ఆ హనుమంతుడు. 250 ఏళ్ల చరిత్ర కలిగింది ఆ దేవాలయం. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ సన్నిధిలో.. కొన్ని రోజులుగా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. వెడ్డింగ్ షూట్స్ మాటునా అభ్యంతరకర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సమీపంలోని కోహెడ‌గుట్ట తెలంగాణలో ఎంతో పేరొందింది. గుట్టపై వెలసిన ఆంజనేయుడు చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఈ ఆలయ నిర్వహణను చూస్తోంది. ప్రకృతి ప్రేమికులు స్వామివారి దర్శనం చేసుకొని, కొండపై ఉన్న అహ్లాదాన్ని చూసి ఎంతో అనుభూతి చెందుతారు. మానసిక ప్రశాంతకు కేంద్రబిందుగా మారిందని పలువురు భక్తులు చెప్తుంటారు. గుట్టపైకి ఎక్కి అలా ప్రకృతిని చూస్తుంటే.. కనుచూపు మేర అంతా పచ్చని చెట్లు, చల్లని గాలులు, పక్షుల కిలకిలలే వినిపిస్తాయి. హైదరాబాద్‌కి సమీపాన ఉన్నటువంటి ఇంత చక్కటి ప్రదేశానికి ఎందరో భక్తులు వచ్చి పోతుంటారు. దీన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కొంత మేర అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి భక్తుల తాకిడి మరింతగా పెరిగింది.  అయితే.. ప్రస్తుత కాలంలో ఈ కోహెడగుట్ట జులాయిలకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారింది. నూతనంగా వివాహలు చేసుకునేవారు వెడ్డింగ్ షూట్స్‌ చేస్తున్నారు. ప్రేమికులు, అవారా బ్యాచ్‌ ఈ స్పాట్‌ని కేంద్రంగా చేసుకొని లైంగిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆలయ సమీపంలోనే చికెన్ పార్టీలు, మటన్ పార్టీలు, మందుచిందులకు అడ్డాగా మార్చుకున్నారు. భగవంతుడి సన్నిధిలో ఈ విధమైన కార్యకలాపాలపై ఆలయ కమిటీ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల రక్షణ కార్యక్రమాలు కూడా లోపించాయి. ఆలయానికి రక్షణ కల్పించాల్సిన అధికారులు కూడా పత్తా లేరు. సిగరెట్లు, కండోమ్ ప్యాకెట్లు, మాంసపు అవశేషాలు ఈ గుట్ట సమీపంలో దర్శనమిస్తున్నాయి. దైవ సన్నిధిలో.. ఎంతో నిష్ఠగా భక్తిగా ఉండాల్సిన చోట.. ఈ వికృత కార్యకలాపాలేంటని భక్తులు మండిపడుతున్నారు. వెడ్డింగ్ షూట్స్ కూడా అభ్యంతరకంగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు వెడ్డింగ్ షూట్స్‌కి వచ్చే వారి నుంచి ఆలయ కమిటీ ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. దీంతో ఆలయ నిర్వహణ కొంత మేర కష్టంగా మారిందని తెలుస్తోంది. తుర్కయాంజాల్  మున్సిపాలిటీ అధికారులు కూడా ఏమాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే కోహెడగుట్ట హైదరాబాద్ పరిధిలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించాలని హనుమాన్ భక్తులు కోరుతున్నారు.


కష్టాల్లో భామలు.. ముగ్గురూ ముగ్గురే!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్