శ్రీరాముడిగా- రుద్రుడిగా మహేష్‌బాబు!
మహేష్‌బాబు!
హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 కి ‘వారణాసి’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ లో మహేష్ బాబు పాత్రను రుద్రుడిగా పరిచయం చేశారు. ఆసక్తికరంగా వేదికపై రాజమౌళి మాట్లాడుతూ సినిమాలోని ఒక ప్రత్యేక ఎపిసోడ్ కోసం మహేష్ తో శ్రీరాముడి గెటప్ వేయించానని తెలిపారు. రాముడి గెటప్ లో అతడు అద్బుతంగా కుదిరాడని కూడా కితాబిచ్చారు. దీనిని బట్టి మహేష్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా, శివుడిగాను ద్విపాత్రలలో చూసి అభిమానులు ఆనందించవచ్చు. అలాగే మోడ్రన్ డే కుర్రాడిగాను అతడు నందీశ్వరుడిపై దూసుకెళుతున్న విజువల్స్ ఇప్పటికే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక ప్రపంచ సాహస యాత్రికుడిగా మహేష్ పాత్రను డిఫరెంట్ షేడ్స్ లో రాజమౌళి ఆవిష్కరిస్తున్న తీరు సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. మొదటి గ్లింప్స్ మహేష్‌ను యోధుడిగా ఆవిష్కరించింది. త్రిశూలం పట్టుకుని, ముఖంపై రక్తపు మరకలతో నందీశ్వరుడిపై దూసుకుపోతున్న వీరుడిని తలపించాడు. #వారణాసిలో రుద్రుడిగా మహేష్ బాబును పవర్ ఫుల్ గా రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. నాకు రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. పురాణాలపై సినిమా తీయాలనుకున్నాను.. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా `రామాయణం`లో ఒక ముఖ్య ఘట్టంపై సన్నివేశాలు తీస్తానని అనుకోలేదు ఒక్కో సీన్ రాస్తుంటే, ఒక్కో ఘట్టం రాస్తుంటే ఫీల్ పుట్టుకొచ్చింది... ఎమోషనల్ అయ్యాను.. నేను నేలమీద నడవలేదు అనిపించిందని రాజమౌళి అన్నారు. మహేష్‌కి రాముడి వేషం వేయించి తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నాలో నేనే సగం డైలమాలో ఉన్నాను.. మహేష్ కొంటెగా ఉంటాడు కృష్ణుడిలా ఉండాలనుకున్నా.. రాముడి పాత్రకు సరిపోతాడా? అనుకుంటూనే డైలమాలోనే ఫోటోషూట్ చేసాము. కానీ అతడు బాగా సరిపోయాడు. మొదటి ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకున్నాను. పొరపాటున ఎవరైనా చూసేస్తారేమో అని జాగ్రత్త పడ్డాను.. అంత బాగా రాముడి పాత్రకు మహేష్ కుదిరాడని తెలిపారు రాజమౌళి. మహేష్ పై ఈ ఎపిసోడ్ ని 60 రోజుల పాటు చిత్రీకరించాం. ఇటవలే ఆ సీన్ ని పూర్తి చేసాం. ఆ ఎపిసోడ్ లో ప్రతి సబ్ ఎపిసోడ్ ఒక సినిమాలాగా ఉంటుంది. ప్రతిదీ కొత్తగా ఆలోచించి ప్లాన్ చేసి తీసాం. ప్రతిదీ ఒక ఛాలెంజింగ్.. అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఈ ఎపిసోడ్ ని పూర్తి చేసాం. అది మహేష్ సినిమాల్లోనే మెమరబుల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో మహేష్ మీరు ఊహంచనంత అందంగా ఉంటాడు.. పరాక్రమంగా ఉంటాడు. దయార్థ్ర హృదయంతో ఉంటాడు.. కోపంగాను ఉంటాడు.. అని మహేష్ పాత్ర లక్షణాలను రాజమౌళి రివీల్ చేసారు.